రషీద్ వేసిన బంతికి వికెట్ ముక్కలైంది!

  • చిట్టగాంగ్ వేదికగా బీపీఎల్ మ్యాచ్
  • రషీద్ ఖాన్ వేసిన గుగ్లీని అర్ధం చేసుకోవడంలో తడబడిన మునవీర
  • నేరుగా మిడ్ వికెట్ ను ముక్కలు చేసిన బంతి
బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్) లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వేసిన బంతి స్టంప్స్‌ ను ముక్కలు చేయడం క్రికెట్ లో ఆసక్తి రేపుతోంది. చిట్టగాంగ్‌ వైకింగ్స్‌- కొమిల్లా విక్టోరియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో కొమిల్లా విక్టోరియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ 16వ ఓవర్ వేశాడు. రషీద్ సంధించిన గుగ్లీని అర్థం చేసుకోవడంలో తడబడిన శ్రీలంక బ్యాట్స్ మన్ మునవీర లెగ్ వికెట్ వైపుగా బ్యాటును తిప్పాడు.

దీంతో బంతి నేరుగా మిడ్ వికెట్ ను తాకింది. రషీద్ వేసిన బంతి వేగానికి వికెట్ ముక్కలైపోయింది. పేసర్ బౌలింగ్ లో వికెట్ ముక్కలు కావడం అన్నది పెద్ద ఆశ్చర్యకరం కాదు కానీ, స్పిన్నర్ విసిరిన బంతి వికెట్ ను ముక్కలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, రషీద్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
rasheed khan
gugli
bowld
stumph break
bpl

More Telugu News